News August 17, 2024
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్యాధికారి

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. శనివారం బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రికార్డ్స్ వెరిఫై చేసి వాక్సినేషన్ పెర్ఫార్మన్స్, BCG, ANC, రికార్డులను ఇంప్రూవ్ చేసుకోవాలని డాక్టర్ కిరణ్ కుమార్‌కు సూచించారు.
Similar News
News October 6, 2025
కర్నూలు టీచర్లకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు.
News October 5, 2025
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
News October 4, 2025
1100కు ఫోన్ చేయండి: కలెక్టర్

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని లెక్టర్ సిరి శనివారం వెల్లడించారు. అర్జీదారులు meekoస్am.ap.gov.in వెబ్ సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మండల కేంద్రంలో, మున్సిపాల్టీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.