News August 17, 2024
మంచిర్యాల: ఆగి ఉన్న కారులోంచి రూ.18లక్షలు చోరీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఫిన్ చేద్దామని ఆపిన కారులో నుంచి రూ.18 లక్షల నగదును అపహరించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యాపారం పనులపై హైదరాబాద్ నుంచి వచ్చిన వాసవి ట్రేడర్స్ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి కారులో ఉంచారు. అయితే కారు డోర్ లాక్ వేయక పోవడంతో నగదు తీసుకొని దుండగులు పరారైనట్లు తెలిపారు.
Similar News
News January 22, 2025
MNCL:మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో అప్రమత్తంగా ఉండాలి:CP
మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
News January 22, 2025
నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి
నిర్మల్‌లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News January 22, 2025
నాగోబా జాతర విశేషాలు మీకు తెలుసా..!
తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. మేస్రం వంశీయులు ఇప్పటికే గంగాజలం తీసుకొని రావడానికి జన్నారంలోని కలమడుగుకు బయలుదేరారు. అయితే వారు జలం తీసుకొచ్చే కుండులను ఓ ప్రత్యేక వంశీయులే చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ కుండలను సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. మేస్రం వంశీయులు పూజకు వినియోగించే దీపంతలు, నీటికుండలు, వంట ఉపయోగించే పాత్రలను కూడా వారే అందిస్తారు.