News August 17, 2024
విజయవాడ: ద్విచక్రవాహనదారులకు పోలీసులు హెచ్చరికలు
ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని డీసీపీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్‌పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో ఆయన ద్విచక్ర వాహన మెకానిక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు.
Similar News
News November 26, 2024
సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలి: కొలుసు
యువతీ, యువకులు సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలని మంత్రి కొలుసు పార్ధసారధి విద్యార్థులకు సూచించారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఫాలోకానని చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాను ఫాలో అవ్వరని చెప్పారు. సోమవారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని అన్నారు.
News November 26, 2024
కృష్ణా: MSC రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- ఫారెస్ట్రీ, న్యూట్రిషన్ & డైటిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్ టెక్నాలజీ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలంది.
News November 26, 2024
కృష్ణా: నేడు అన్ని విద్యా సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30ని.లకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.