News August 17, 2024
హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అచ్చెన్న

హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసిన హిజ్రాలు తమ సమస్యలు వివరించారు. సమాజంలో తమ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. తమ జీవనం ఏదోలా నెట్టికొస్తున్నామని, సమాజంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.
Similar News
News January 22, 2026
SKLM: KR స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా, శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KR స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ విషయంలో ఎంట్రీలు, ఎగ్జిట్ అత్యవసర సమయాల్లో ప్రత్యేక మార్గాలు వినియోగంపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. DSP వివేకానంద, RDO కృష్ణమూర్తి ఉన్నారు.
News January 22, 2026
అరసవెల్లి: రథసప్తమికి దర్శన టోకెన్ల ధరలు ఇలా..!

అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 24న జరగనున్న రథసప్తమి ఉత్సవాలలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనం, రూ.100 దర్శనం, రూ.300, వీఐపీ దర్శనాలు కోసం ఒక్కోదానికి రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా పంపించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి మీడియా పాయింట్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.
News January 22, 2026
అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో నేటి కార్యక్రమాలు.!

అరసవెల్లిలో సప్తాహ్ ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అరసవెల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన సేవ జరగనుంది. డచ్ బంగ్లా వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్, బెలూన్ రైడ్లు ఏర్పాటు చేశారు. కేఆర్ స్టేడియంలో సాయంత్రం ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే, నృత్యాలు, మిమిక్రీ, గోరటి వెంకన్న కార్యక్రమంల ‘శ్రీనివాస కళ్యాణం’నాటిక జరుగుతుంది.


