News August 17, 2024
భారతీయులు జాగ్రత్త పడుతున్నారు
మారుతున్న జీవన పరిస్థితులు, ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవిత బీమా తీసుకుంటున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతోంది. దీంతో బీమా కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జులైలో 16.3% వృద్ధిని నమోదు చేసినట్టు కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత పాలసీల సంఖ్య గత నెలలో 30 శాతం పెరిగాయని, ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఎల్ఐసీలో అత్యధిక పాలసీలు నమోదైనట్టు వెల్లడించింది.
Similar News
News January 22, 2025
వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.
News January 22, 2025
స్కూళ్లకు గుడ్‌న్యూస్
APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
News January 22, 2025
‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం
AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.