News August 17, 2024

కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: KTR

image

TG: కాంగ్రెస్ 8 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా నిత్యం ప్రజలతోనే ఉండాలని, వచ్చే నాలుగేళ్లలో పార్టీని బలోపేతం చేసుకుందామని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడాలని.. అలాంటి వారికే గౌరవం, గుర్తింపు ఉంటాయని చెప్పారు.

Similar News

News January 22, 2025

స్కూళ్లకు గుడ్‌న్యూస్

image

APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

News January 22, 2025

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం

image

AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.

News January 22, 2025

ఏంటీ ‘బర్త్ టూరిజం’?

image

పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.