News August 17, 2024

విమానాశ్రయాల తరహా భద్రత కల్పించండి.. ప్రధానిని కోరిన IMA

image

విమానాశ్ర‌యాల త‌ర‌హాలో ఆస్ప‌త్రుల‌ను సేఫ్ జోన్లుగా మార్చేందుకు అవసరమైన భ‌ద్ర‌త, వసతులు పెంచాలని ప్ర‌ధాని మోదీని IMA కోరింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం – 1897లోని 2020 నాటి సవరణలను ‘ది హెల్త్‌కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్’ ముసాయిదాలో చేర్చే కేంద్ర చట్టాన్ని తేవాలని డిమాండ్ చేసింది. ఇది వైద్యుల రక్షణకు దోహదం చేస్తుందని పేర్కొంది.

Similar News

News November 5, 2025

ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

image

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.

News November 5, 2025

ఇది ట్రంప్‌కు వార్నింగ్ బెల్!

image

USలోని పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ట్రంప్ ఏమాత్రం ఇష్టపడని సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ <<18202940>>న్యూయార్క్ మేయర్‌గా<<>> ఎన్నికయ్యారు. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల <<18202619>>గవర్నర్<<>> ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ నెగ్గడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News November 5, 2025

వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

image

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో రిచ్‌మండ్‌కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.