News August 17, 2024

రోహిత్ vs విరాట్.. ఏ టీమ్ గెలుస్తుంది?

image

క్రికెట్ ప్రేమికులకో పజిల్. ప్రస్తుత భారత ప్లేయర్లను రెండు జట్లుగా విభజించి వన్డే ఆడిస్తే ఏ టీమ్ గెలుస్తుందో అంచనా వేయండి.
టీమ్ A: రోహిత్ (C), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, పంత్ (WK), సూర్య, హార్దిక్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

టీమ్ B: గిల్, గైక్వాడ్, విరాట్ (C), కేఎల్ రాహుల్ (WK), రియాన్ పరాగ్, శివమ్ దూబే, జడేజా, సుందర్, చాహల్, షమీ, సిరాజ్

Similar News

News August 31, 2025

ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ బిల్లులు

image

TG: ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు ₹700 కోట్లను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులు ₹392 కోట్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద మరో ₹308 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇంకా ₹10వేల కోట్ల వరకు బిల్లులు రావాలని తెలిపారు. కాగా ఉద్యోగుల బిల్లులకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని జూన్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

News August 31, 2025

థాంక్యూ జగన్ గారు: అల్లు అర్జున్

image

AP: అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించడం పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ X వేదికగా సంతాపం తెలిపారు. ‘క‌న‌క‌ర‌త్న‌మ్మ గారు మృతిచెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. ‘థాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు చాలా సంతోషం’ అని కామెంట్ చేశారు.

News August 31, 2025

ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

image

TG: అత్యవసరంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కాళేశ్వరం నివేదిక, BC రిజర్వేషన్ల కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం వంటి రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, BC రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మల్చుకునేలా అధికార పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టాలని BRS భావిస్తోంది.