News August 17, 2024

చెప్పింది ఎంత.. చేసింది ఎంత? (2/2)

image

TG: రూ.31 వేలకోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బ‌డ్జెట్లో రూ.26 వేలకోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వం రూ.18 వేలకోట్లు విడుద‌ల చేసి మాఫీ చేసేసిన‌ట్టు చెబుతోంద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో BJPలో BRS విలీనం అంటూ కాంగ్రెస్ దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ వ్యూహానికి తగ్గట్టుగానే BRSని విలీనం చేసుకోవ‌డం లేద‌ని BJP, అవాస్తవమని BRS వివ‌ర‌ణ ఇచ్చేందుకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం.

Similar News

News December 28, 2025

కొత్తగా 784 మంది స్పెషాలిటీ వైద్యులు: సత్యకుమార్

image

AP: సెకండరీ/టీచింగ్ ఆస్పత్రులకు కొత్తగా 784 మంది PG వైద్యులు(సీనియర్ రెసిడెంట్స్) జనవరి 1 నుంచి రాబోతున్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల PG పూర్తి చేసిన వారికి పోస్టింగులు ఇస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెల 29 వరకు ఆప్షన్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. వీరు 6 నెలలు బోధనాసుపత్రుల్లో, మరో 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News December 28, 2025

టీమ్ ఇండియాకు కొత్త కోచ్?

image

న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టుల్లో IND ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని BCCI భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో సొగసరి బ్యాటర్, తెలుగు క్రికెటర్ VVS లక్ష్మణ్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ BCCI సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్నారు.

News December 27, 2025

ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

image

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.