News August 18, 2024
పార్వతీపురం: ‘100 రోజుల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి’

జిల్లాలో వంద రోజుల విజన్ డాక్యుమెంట్ అన్ని శాఖలు తక్షణం తయారు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047పై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా శాఖల విజన్ ఉండాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ వివరించారు.
Similar News
News October 1, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు

ఇన్క్రెడిబుల్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు లభించింది. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరరావు తూర్పు భాగవతం ప్రదర్శన చేయడంతో పాటు కళను బతికించేందుకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. తండ్రి నుంచి నేర్చుకున్న కళను భవిష్యత్ తరాలకు అందించాలని ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్లు శంకరరావు చెప్పారు.
News October 1, 2025
సీఎం పర్యటన.. 600 మందితో బందోబస్తు: VZM SP

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News September 30, 2025
సీఎం చంద్రబాబు టూర్ టైమింగ్స్ ఇవే..

➤ఉదయం 11:10 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు
➤ఉదయం 11:20కి హెలీకాప్టర్‌లో స్టార్ట్ ➤ఉదయం 11:30కి దత్తి హెలీప్యాడ్‌కు చేరిక
➤11:40 వరకు ప్రముఖుల ఆహ్వానం ➤11:50కి దత్తి గ్రామానికి రోడ్డు మార్గంలో చేరిక
➤11:50 నుంచి మ.12:05 వరకు డోర్ టూ డోర్ పింఛన్ల పంపిణీ
➤12:10కు ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు ➤ మధ్యాహ్నం 2:10 వరకు ప్రజా వేదిక వద్ద
➤2:15కి పార్టీ కేడర్‌తో మీటింగ్ ➤సా.4 గంటలకు తిరుగు ప్రయాణం