News August 18, 2024

బ్రెజిల్‌లో ట్విటర్ మూసివేత

image

బ్రెజిల్‌లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ‘అక్కడ మా హక్కులు, బాధ్యతల విషయంలో తను విధించిన సెన్సార్‌షిప్ పాటించాల్సిందేనని ఆయన బెదిరించారు. తను చెప్పినట్లు చేయకుంటే మా ప్రతినిధిని అరెస్టు చేయిస్తామన్నారు. సిబ్బంది భద్రత కోసం దేశంలో ట్విటర్ మూసేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

Similar News

News January 23, 2025

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే..

image

2025 గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160మందితో కూడిన కవాతు, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందాలు భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరైన విషయం తెలిసిందే.

News January 23, 2025

రూ.173కు కొని.. రూ.43 కోట్లకు అమ్మాడు!

image

ఇంట్లో పాత వస్తువులుంటే మనం చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆ పాత వస్తువు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. పాత వస్తువులను కలెక్ట్ చేసే అలవాటున్న ఓ వ్యక్తి 2010లో ఓ షాపుకెళ్లి $2 (రూ. 173) చెల్లించి పాత ఫొటోను కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందినవారని తెలుసుకున్నాడు. ఈక్రమంలో 2014లో దీనిని వేలం వేసి $5 మిలియన్లకు(రూ.43కోట్లు) విక్రయించాడు.

News January 23, 2025

ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం: చంద్రబాబు

image

CMలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని AP CM <<15229916>>చంద్రబాబు<<>> అన్నారు. ‘కలిసి పనిచేస్తే వికసిత భారత్ సాధ్యమే. వ్యవసాయం, మానవాభివృద్ధిలో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో AP కృషి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 165గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నాం’ అని దావోస్‌లో చంద్రబాబు తెలిపారు.