News August 18, 2024

VZM: టీచర్ల మృతి.. రూ.4 కోట్లతో బ్రిడ్జి

image

ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట(M) సరాయివలస సమీపంలోని రాయిమాను కొండవాగులో ఇద్దరు టీచర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన టీచర్లు మహేశ్, ఆర్తి మృతదేహాలు స్వగ్రామం చేరే వరకు పూర్తి ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని పేర్కొంది. వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు.

Similar News

News January 10, 2026

VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

image

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.

News January 9, 2026

100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.

News January 9, 2026

VZM: ‘ఉపాధి హామీ పని దినాలు పెరుగుతాయి’

image

వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కి పెరుగుతాయన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.