News August 18, 2024
నల్గొండ: కొత్త రైతులకు రూ.90 కోట్ల పంట రుణాలు

డీసీసీబీ పరిధిలోని సహకార సంఘాల ద్వారా కొత్త రైతులకు వానాకాలం సీజన్‌లో రూ.90 కోట్లు పంట రుణాలు ఇస్తామని బ్యాంక్ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డీసీసీబీ కింద 89,888 మంది రైతులకు రూ.499.48 కోట్లు రుణమాఫీకి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. 52,708 మంది రైతులకు రూ. 279.76 కోట్లు వచ్చాయన్నారు. వచ్చేవారం రుణమాఫీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాని వారికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 10, 2025
NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.
News November 10, 2025
నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.
News November 10, 2025
NLG: ఆయకట్టులో జోరుగా వరి కోతలు

నాగార్జునసాగర్ నాన్ ఆయకట్టు, ఆయకట్టు పరిధిలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1.26 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు పంటచేతికి వచ్చే సమయంలో ఒక పక్క అకాల వర్షం వెంటాడుతుండగా.. మరో పక్క కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో కూలీల కొరత మరింత ఎక్కువగా ఉంది.


