News August 18, 2024
లోన్ రూ.1.50లక్షలు.. మాఫీ రూ.83!
TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్య SBIలో రూ.1.50లక్షల పంట రుణం తీసుకున్నారు. తాజాగా ఆయనకు రూ.83 మాత్రమే రుణమాఫీ అయినట్టు మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో షాకైన మల్లయ్య వ్యవసాయ అధికారులను సంప్రదించగా బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకురావాలని సూచించారు. ఇంతలోనే బ్యాంక్ సమయం ముగియడంతో తనకు న్యాయం చేయాలని ఆ రైతు వేడుకుంటున్నారు.
Similar News
News January 15, 2025
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025
*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్
News January 15, 2025
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. EAPCET తేదీలు వచ్చేశాయ్
TG: ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCETను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. APR 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
News January 15, 2025
భారత మహిళా జట్టు విధ్వంసం.. 50 ఓవర్లలో 435 రన్స్
ఐర్లాండ్ మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసింది. ప్రతికా రావల్(154), స్మృతి మంధాన(135) సెంచరీలతో చెలరేగగా, రిచా ఘోష్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా నాలుగో స్థానం. గతంలో కివీస్ ఉమెన్ 491/4, 455/5, 440/3 స్కోర్లు చేసి టాప్‌లో ఉంది.