News August 18, 2024

కామారెడ్డి: పది నిమిషాల్లోనే భారీ చోరి

image

కామారెడ్డి GR కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి బయటకు వెళ్లిన యజమాని పది నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి దొంగలు చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రాములు కూరగాయల కోసం నిన్న 2.29కు ఇంటికి తాళం వేసి మార్కెట్ వెళ్లాడు. 2.39కి ఇంటికి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఏడున్నర తులాల బంగారం, ముప్పై తులాల వెండి, రూ. 50వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News January 15, 2025

కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.

News January 15, 2025

NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్

image

తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.