News August 18, 2024

కొత్తగూడెం: సింగరేణి కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా శ్రీనివాస్

image

సింగరేణి సంస్థ కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జీఎంగా ఉన్న గురువయ్య జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఆర్-1 జీఎంగా ఉన్న శ్రీనివాస్‌ను నియమించారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఆయన మాట్లాడుతూ.. విలువైన కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రమాదాల సంఖ్య తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, స్వీయరక్షణపై అందరూ దృష్టి సారించాలన్నారు.

Similar News

News September 17, 2025

ఖమ్మం: పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 22 నుంచి 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్ (టీఓఎస్‌ఎస్) పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 17, 2025

ఖమ్మం: రేపటి నుంచి సదరం క్యాంపులు

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. దివ్యాంగులు ఈ క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సదరం క్యాంపులు ఈ నెల 18, 23, 25, 30వ తేదీలలో జరుగుతాయి. అర్హులైన దివ్యాంగులు తమ మెడికల్ రిపోర్టులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి హాజరు కావాలని ఆయన కోరారు.

News September 16, 2025

జాలిమూడి కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

image

మధిర జాలిమూడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం రూ. 5.41 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులను విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మరమ్మతులు పూర్తయితే, ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు.