News August 18, 2024
స్టీల్ ప్లాంట్ గనుల లీజు పొడిగింపుపై హర్షం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గర్భాం మాంగనీస్ గనుల లీజును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంపై చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బట్ హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 20, 2025
ఆనందపురం: లంకె బిందెల పేరుతో రూ.28 లక్షలు స్వాహా
ఆనందపురం మండలం బీపీ కళ్లాలకు చెందిన నలుగురు వద్ద నుంచి లంకె బిందెలు పేరుతో ముగ్గురు వ్యక్తులు రూ.28 లక్షలు కాజేశారు. దీనిపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. తన దగ్గర బంగారు నిధి ఉందని పూజలు చేయడానికి రూ.30 లక్షలు అవుతుందని నకిలీ స్వామీజీ నమ్మించాడు. బాధితులు దఫదఫాలుగా నిందితులకు రూ.28 లక్షలు ఇచ్చారు. ఈనెల 2న బాధితులకు రెండు బిందెలు ఇచ్చి వారు వెళ్లిపోయారు. తర్వాత చూడగా వాటిలో ఏమి లేవు.
News January 20, 2025
ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
News January 19, 2025
విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.