News August 18, 2024

కర్ణాటకలో ఇది రెండోసారి

image

ఒక కర్ణాటక CM అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2010లో అప్పటి BJP CM యడియూరప్ప అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు గవర్నర్ HR భరద్వాజ్ విచారణకు ఆమోదించారు. యడ్డీ రాజీనామాకు అప్పటి ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ CM సిద్ద రామయ్యకు భూకుంభకోణం ఆరోపణలతో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ విచారణకు అనుమతిచ్చారు.

Similar News

News January 22, 2025

సైఫ్‌పై కత్తి దాడి: పోలీసు శాఖ ట్విస్ట్

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్‌ పీఐ సుదర్శన్ గైక్వాడ్‌ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్‌నూర్కర్‌ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.

News January 22, 2025

APలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయండి: లోకేశ్

image

దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్‌ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.

News January 22, 2025

ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్

image

AP: నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2 నెలలు పొడిగించింది. అక్రమాలపై పూర్తి సమాచారం పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.