News August 18, 2024

NLG: అధికారులకు సవాలుగా మారిన LRS

image

ఉమ్మడి జిల్లాలో LRS దరఖాస్తుల పరిశీలన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగాల్లో 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలావరకు అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం అంత సులువుగా కనిపించడం లేదు. 3 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 2, 2025

NLG: నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా?!

image

నల్గొండ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే.

News November 2, 2025

NLG: కాగితాలపైనే అంచనా లెక్కలు… రైతులందరికీ సాయమందేనా?

image

ఆకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే మొక్కుబడిగానే నిర్వహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణం నష్టం నమోదులోనూ అదే తీరు కనిపిస్తుందన్నారు.

News November 2, 2025

5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు

image

ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, తునికి విజయ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు చేరుకోవాలని కోరారు.