News August 18, 2024
‘డియర్ రజనీ.. నన్ను క్షమించు’ అని లేఖ రాసి..
TG: సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట GOVT ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరారు.
Similar News
News January 22, 2025
బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.
News January 22, 2025
BREAKING: సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.
News January 22, 2025
OTTలోకి వచ్చేస్తున్న పుష్ప-2.. ఎప్పుడంటే?
బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన పుష్ప-2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 29 లేదా 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, OTTలోనూ ఇదే వెర్షన్‌నే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.1850 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.