News August 18, 2024
కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?

కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.
Similar News
News January 12, 2026
వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
News January 12, 2026
ప్రజావాణి వినతులు పరిష్కార దిశగా అడుగులు: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్‌కు సమర్పించారు. మొత్తం 129 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 52, ఇతర శాఖలకు సంబంధించినవి 77 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News January 12, 2026
ఇంటర్ పరీక్షలు సమన్వయంతో నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు.ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ రాబోయే పరీక్షల వివరాలను కలెక్టర్‌కి వివరించారు.


