News August 18, 2024
కడప: ‘రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించండి’

కడప మండలం చిన్నచౌక్‌లో 3 ఎకరాలకు పైబడిన ప్రభుత్వ స్థలం క్రమేపీ అన్యాక్రాంతమవుతోందని, భూ పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కడప తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రూములు కట్టమంటున్నారన్నారు.
Similar News
News January 26, 2026
YVU ఫైన్ఆర్ట్స్ శాఖలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.!

కడప YVU పీజీ కళాశాల ఫైన్‌ఆర్ట్స్ శాఖ కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలి నియామకం కోసం ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సంప్రదించాలని సూచించారు.
News January 26, 2026
కడప జిల్లాలో నేటి PGRS రద్దు: SP.!

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఈనెల 26వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నందున ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు గమనించి, దూర ప్రాంతాల నుంచి రాకూడదని ఆయన కోరారు. తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.
News January 25, 2026
కడపలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడప సిద్ధమైంది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో రేపు ఉదయం 8:30 గంటలకు జాతీయ జండాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


