News August 18, 2024
U-19 T20 ఉమెన్స్ WC షెడ్యూల్ వచ్చేసింది

మలేసియా వేదికగా 2025లో జరగనున్న అండర్-19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 16 టీమ్‌లు 4 గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. జనవరి 18 నుంచి 24 గ్రూప్ దశ, 25 నుంచి 29 వరకు సూపర్ సిక్స్, 31న రెండు సెమీ ఫైనల్స్(FEB 1 రిజర్వ్ డే), 2న ఫైనల్ మ్యాచ్(3న రిజర్వ్ డే) జరగనుంది. గ్రూప్-Aలో ఇండియా, విండీస్, శ్రీలంక, మలేసియా ఉన్నాయి.
Similar News
News September 14, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు
News September 14, 2025
ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.
News September 14, 2025
జొన్న: కాండం తొలుచు పురుగు.. నివారణ

* పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
* కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.