News August 18, 2024

ఎన్నిక‌ల‌పై MVA వ్యూహాలు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీలోని మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య సీట్ల పంప‌కాల‌కు ఉమ్మ‌డి స‌ర్వే నిర్వ‌హిద్దామ‌ని కాంగ్రెస్ ప్ర‌తిపాదించింది. అయితే ఎన్నికల తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి CM పదవి ఇచ్చే ఫార్ములాను విర‌మించుకోవాల‌ని శివ‌సేన UBT చీఫ్‌ ఉద్ధవ్ కోరుతున్నారు. ఈ ఫార్ములా వ‌ల్ల‌ ప్రతి పార్టీ తమకు గరిష్ఠ సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తాయని వాదిస్తున్నారు.

Similar News

News November 4, 2025

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.

News November 4, 2025

ఫైనల్‌కు ముందు కౌర్ బామ్మకు హార్ట్ఎటాక్.. విషయం దాచి!

image

ఉమెన్స్ WC ఫైనల్‌కు ముందు IND ప్లేయర్ అమన్‌జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్ఎటాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌర్‌కు తెలియకుండా దాచింది. విజయం తర్వాత విషయం తెలుసుకుని ఆమె బాధతో కుంగిపోయారు. కాన్సంట్రేషన్ దెబ్బతినొద్దని ఆమెకు ఈ విషయాన్ని చెప్పలేదని కుటుంబం తెలిపింది. కూతురి కోసం గుండెనిబ్బరం చూపిన కుటుంబంపై ప్రశంసలొస్తున్నాయి.

News November 4, 2025

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<>HAL<<>>) 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, NTC+NAC(ITI) అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in