News August 18, 2024
NZB: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నవీపేట్‌లోని ఆటోనగర్‌కు చెందిన బాలాజీ తన చెల్లెలితో కలిసి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. లోకో పైలట్ గమనించి ట్రైన్‌ను ఆపి క్షతగాత్రుడిని బాసరకు తీసుకురాగా 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు.
Similar News
News April 6, 2026
NZB: జిల్లా కార్యాలయంలో BJP ఆవిర్భావ దినోత్సవం

బజేపీ NZB జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం BJP ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా మాట్లాడారు. అంత్యోదయ స్ఫూర్తితో, దేశమే ప్రథమం అనే నినాదంతో బీజేపీ కార్యకర్తలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News April 6, 2026
నిజామాబాద్ ఫోటోగ్రాఫర్‌కు ప్రథమ బహుమతి

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తన ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నిలిచిన శ్రీనివాస్‌ను జిల్లా ప్రజలు, తోటి ఫోటోగ్రాఫర్లు, స్నేహితులు అభినందిస్తున్నారు.