News August 18, 2024
BJPలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం!

ఝార్ఖండ్ మాజీ సీఎం, JMM MLA చంపై సోరెన్ BJPలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అమిత్ షా సమక్షంలో ఆయనతో పాటు మరో ముగ్గురు JMM ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చంపై చూసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News October 30, 2025
ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
News October 30, 2025
విత్తనాల కొనుగోలుకు ₹110 కోట్ల బ్యాంకు రుణం

AP: రబీ(2025-26)లో పంపిణీ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఏపీ సీడ్ కార్పొరేషన్ ₹110 కోట్ల రుణం తీసుకోనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకొనే ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ రుణాన్ని తీర్చలేని పక్షంలో ఈ గ్యారంటీ వర్తిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు క్లోజర్‌కు సున్నాఛార్జీలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణంతో రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తారు.
News October 30, 2025
ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>


