News August 18, 2024

HYD: వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించటం ఇక సులువు!

image

HYDలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు తెలిపారు. దీనిని తాడుతో పంపుతారని, 100 కేజీల బరువు వరకు లాగుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

Similar News

News January 27, 2026

HYD: మన్యం అగ్నికణం.. అల్లూరి సీతారామరాజు

image

సాయుధ పోరాటమే స్వాతంత్ర్యానికి మార్గమని విశ్వసించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. యుద్ధ విద్యలో ఆరితేరిన అల్లూరి ఆంగ్లేయుల అరాచకాలపై ఆయుధాలు ఎక్కుపెట్టారు. మన్యం గిరిజనుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గర్జించారు. మహిళల అవమానాలపై తెల్లదొరల అరాచకానికి ఎదిరించి తిరగబడ్డారు. గెరిల్లా దాడులతో పోలీస్‌స్టేషన్లపై పిడుగులా విరుచుకుపడ్డారు. ప్రజల కోసం లొంగిన అల్లూరిని ఆంగ్లేయులు అతి కిరాతకంగా హతమార్చారు.

News January 27, 2026

HYDలో బస్సుల కొరత.. ప్రయాణికుల ఇక్కట్లు..!

image

మేడారం జాతర ప్రభావం భాగ్యనగర రవాణా వ్యవస్థపై పడింది. సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం గ్రేటర్ పరిధిలోని సుమారు 50 శాతం సిటీ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మళ్లించడంతో నగరంలో రద్దీ పెరిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే వారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News January 27, 2026

HYD: కలల ఇల్లు చూసుకొని వస్తుండగా.. అంతులేని విషాదం

image

అభం శుభం తెలియని చిన్నారిని కూకట్‌పల్లిలో విధి వెంటాడింది. ఇంటికెళ్ళాల్సిన 2 ‘U TURN’లు దాటించి 3వ U TURN వద్ద మృత్యు పాశం మాంజా రూపంలో ఆ కుటుంబంలో <<18967621>>తీరని శోకాన్ని<<>> మిగిల్చింది. పటాన్‌చెరులో కొత్త ఇల్లు చూసుకొని తిరిగి వివేకానందనగర్ వస్తుండగా నగల దుకాణంలోకి వెళ్దాం అనుకుని ఆగితే.. ముందు కూర్చున్న 5ఏళ్ల నిష్విక ఏంజరుగుతుందో తెలియకుండానే తల్లిదండ్రుల ముందే ప్రాణాలు విడిచింది.