News August 18, 2024

రేపు డిశ్చార్జ్ కానున్న పి.సుశీల

image

లెజెండరీ సింగర్ పి.సుశీల(88) కిడ్నీ సమస్య కారణంగానే <<13881421>>అస్వస్థతకు<<>> గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. 1935 నవంబర్ 13న విజయనగరంలో సుశీల జన్మించారు. 1950 నుంచి 1990 వరకు 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు. ఈమెను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఉత్తమ గాయనిగా 5 నేషనల్ అవార్డులను అందుకున్నారు.

Similar News

News January 27, 2026

భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు

image

ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక<<18969639>> ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్<<>> (FTA) ఖరారు కావడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. EU కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గొప్పలు చెప్పుకున్నారు. ఉక్రెయిన్‌ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై టారిఫ్‌లు విధిస్తే, EU మాత్రం ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.

News January 27, 2026

హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

image

లాస్‌ఏంజెలిస్(US)లోని హాలీవుడ్‌ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.

News January 27, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>IIT <<>>గువాహటిలో 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD(VLSI/మైక్రో ఎలక్ట్రానిక్స్/CS), MTech/ME, BE/BTech(RTL డిజైన్/ డేటా వెరిఫికేషన్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు నెలకు రూ.68,450, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.43,250 చెల్లిస్తారు. సైట్: https://iitg.ac.in