News August 18, 2024

ఈ జిల్లాల్లో వర్షం

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. 40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News March 25, 2026

ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

image

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్‌ను చాటిచెబుతోంది.

News March 25, 2026

రింకూకు KKR ప్రమోషన్

image

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.

News March 25, 2026

ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.