News August 18, 2024

ఏపీ కేంద్రంగా జాతీయ క్రీడలు నిర్వహిస్తాం: చిన్ని

image

AP: విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. ఇటీవల ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు విజయవాడలో వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించి సన్మానించింది. ‘2027లో అమరావతి కేంద్రంగా జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తాం’ అని చిన్ని వెల్లడించారు.

Similar News

News January 19, 2026

CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

image

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.