News August 18, 2024
సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

బడుగు బలహీన వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడని కొనియాడారు.
Similar News
News July 6, 2025
కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News July 6, 2025
KNR: ‘జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి’

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
News July 6, 2025
కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.