News August 18, 2024
లోకేశ్ చొరవ.. కర్నూలులో సమస్యకు పరిష్కారం

మంత్రి నారా <<13881711>>లోకేశ్<<>> చొరవతో కర్నూలులో మురుగు సమస్యకు పరిష్కారం లభించింది. ‘కర్నూలు నగర శివారుకు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది ఈ సమస్య. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా మురుగు నీరు బయటికి వెళ్లేందుకు వీలులేదు. ప్రస్తుతం 1.70 కి.మీ మేర కచ్చ కాలువ నిర్మించి గల్ఫర్‌తో మురికి నీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం’ అని KMC ట్వీట్ చేసింది.
Similar News
News March 6, 2026
కర్నూలు జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు ఇవే

కర్నూలు జిల్లాలో ఈనెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గార్గేయపురం, వసంత నగర్, ఉలిందకొండ, సి.బెలగల్, దేవనకొండ, ఆస్పరి పరిధిలోని ప్రధాన పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
News March 6, 2026
కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.
News March 6, 2026
మహిళలను సన్మానించండి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.


