News August 18, 2024
కృష్ణా: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో మార్పులు

ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.
Similar News
News January 29, 2026
కడప స్మార్ట్ కిచెన్ భేష్: కలెక్టర్ బాలాజీ

కడప సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం కడపలో పర్యటించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే ఈ విధానం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News January 29, 2026
ఉప్పెన బిడ్డ.. వేల కోట్ల అధిపతి!

నాగాయలంక (M)కి చెందిన బొండాడ రాఘవేంద్రరావు జీవితం స్ఫూర్తిదాయకం. దివిసీమ ఉప్పెనలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబంలో పుట్టిన ఆయన కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. L&T, ఆస్టర్ టెలికామ్‌లో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2011లో బొండాడ ఇంజినీరింగ్స్‌ను స్థాపించారు. టెలికామ్, విద్యుత్ రంగాల్లో విస్తరించి నేడు రూ. 7500 కోట్ల మార్కెట్ విలువతో హురూన్ సంపన్నుల జాబితాలో చోటు దక్కింది.
News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.


