News August 18, 2024

జిల్లాలో మొదలైన రక్షా బంధన్ సందడి

image

సోదర సోదరీమణుల అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునేది రాఖీ. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మార్కెట్లలోని రంగు రంగుల భిన్నమైన రాఖీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం ఎక్కువ సాగుతోందని దుకాణ యాజమన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 2, 2026

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.

News January 2, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నల్గొండ ఎస్పీ

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.

News January 2, 2026

పొగమంచుతో ప్రయాణం.. తస్మాత్ జాగ్రత్త: నల్గొండ ఎస్పీ

image

చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు అతివేగం, ఓవర్‌టేకింగ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలకు తప్పనిసరిగా ఫాగ్ లైట్లు వాడాలని, ముందు వాహనానికి సురక్షిత దూరం పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.