News August 18, 2024
ఎన్టీఆర్ చేతికి గాయం.. వార్-2 షూటింగ్ ఆలస్యం!

వచ్చే నెలలో ‘దేవర’తో థియేటర్లలో సందడి చేయనున్న NTR ఇటీవల జిమ్‌లో <<13850566>>గాయపడ్డ<<>> సంగతి తెలిసిందే. దీని వల్ల హృతిక్‌తో కలిసి ఆయన చేస్తున్న ‘వార్-2’ షూటింగ్ అక్టోబర్‌కు వాయిదా పడినట్లు సమాచారం. చేతి గాయం నుంచి NTR కోలుకున్నాక ఆయన ఇంట్రడక్షన్ సీన్‌ను ఒక షిప్‌లో షూట్ చేస్తారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వార్-2 షూటింగ్ సెట్స్‌లో NTR గాయపడ్డారని మరోసారి వార్తలు రాగా, వాటిని ఆయన టీమ్ ఖండించింది.
Similar News
News October 29, 2025
అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
News October 29, 2025
మామిడిలో చెదను ఎలా నివారించాలి?

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.
News October 29, 2025
పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమను రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. నిజం చెప్పినా ఏంకాదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు చెప్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.


