News August 18, 2024

బౌలర్లు గొప్ప కెప్టెన్లు అవుతారు: బుమ్రా

image

బౌలర్లు చాలా తెలివైన వారని టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. ‘ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పాట్ కమిన్స్ రాణిస్తున్నారు. నా చిన్నతనంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ కెప్టెన్సీ చేయడం చూశా. మనకు కపిల్‌దేవ్, పాక్‌కు ఇమ్రాన్‌ఖాన్ వరల్డ్‌కప్ తెచ్చారు. కాబట్టి బౌలర్లు చాలా స్మార్ట్’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Similar News

News March 20, 2026

అనకాపల్లి: ఈనెల 24న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

జిల్లాస్థాయి శాప్ లీగ్స్ అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు ఈనెల 24న అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి.శైలజ శుక్రవారం తెలిపారు. 35, 45 ఏళ్ల పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో ఎంపికైన వారు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తారన్నారు.

News March 20, 2026

2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

image

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News March 20, 2026

‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

image

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.