News August 19, 2024

క్షత్రియులకు చట్టసభల్లో ప్రాధాన్యం ఇస్తాం: సీఎం రేవంత్

image

TG: చట్టసభల్లో క్షత్రియులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ క్షత్రియ సేవా సమితి సభలో హామీ ఇచ్చారు. ‘రాజకీయాల్లో రాణించాలన్న ఉత్సాహంతో ఉన్నవారిని క్షత్రియ వర్గం గుర్తించి ప్రోత్సహించాలి. వారికి పార్టీలో పదవులు, మున్ముందు టికెట్లు కేటాయిస్తాం. అటువంటి వారి జాబితాను క్షత్రియ వర్గ ప్రతినిధులు ఇస్తే ఆయా నేతలను నాయకులుగా తయారుచేస్తాం. తగిన అవకాశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

image

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

News July 5, 2025

పరీక్షల తేదీలు వచ్చేశాయి

image

AP: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షల సవరణ <>షెడ్యూల్‌ను <<>>APPSC ప్రకటించింది. టీటీడీ కళాశాలల్లో రాత పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మిగతా పరీక్షలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. అటు ఆల్ ఇండియా సర్వీసు, రాష్ట్ర సర్వీసు అధికారులు అర్ధవార్షిక, లాంగ్వేజ్ టెస్టులకు దరఖాస్తు చేసుకోవాలని APPSC ప్రకటన విడుదల చేసింది.

News July 5, 2025

B2 బాంబర్స్‌తో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

image

249వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ వైట్‌హౌస్ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి మెలానియాతో పాటు ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ Xలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా ఆర్మీ ఈ B2 బాంబర్స్‌తోనే దాడి చేసింది.