News August 19, 2024

VZM: అన్న క్యాంటీన్‌కు మంత్రి విరాళం

image

అన్న క్యాంటీన్ నిర్వహణకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఆయన రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. పేదల ఆకలి తీర్చేందుకు తన మొదటి నెల జీతం రూ.లక్షను నాన్నమ్మ పేరిట అందజేశారు. ఇంటికి ఎవరు వచ్చినా తన నాన్నమ్మ ఆకలితో ఉంచేది కాదని గుర్తు చేశారు.

Similar News

News November 24, 2024

VZM: పిక్నిక్ స్పాట్స్ వద్ద నిఘా

image

పార్వతీపురం, విజయనగరం ఎస్పీల ఆదేశాలతో పర్యాటక ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద పోలీసులు ఆదివారం బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తోటపల్లి, అడ్డాపుశీల, సీతంపేట, అడలి, పుణ్యగిరి, తాటిపూడి, రామతీర్థం, సారిపల్లి, రామనారాయణం, గోవిందపురం తదితర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకున్నారు. మరి మీరు ఈరోజు ఎక్కడికి పిక్నిక్‌కు వెళ్లారో కామెంట్ చెయ్యండి.

News November 24, 2024

IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 24, 2024

VZM: ఒంటరితనం భరించలేక మహిళ సూసైడ్

image

బాడంగి మండలం కోడూరు పంచాయతీకి చెందిన గౌరమ్మ(55) శనివారం మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరమ్మ భర్త కొంతకాలం క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఈనెల 14న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.