News August 19, 2024
అన్న క్యాంటీన్ల నిర్వహణకు గంగరాజు రూ.కోటి విరాళం
AP: బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం భారీ విరాళాన్ని అందించారు. మంత్రి లోకేశ్‌ను ఆదివారం కలిసిన ఆయన రూ. కోటి చెక్కును అందించారు. క్యాంటీన్ల నిర్వహణ సాఫీగా సాగేందుకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విరాళాన్ని అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే పలువురు భారీ విరాళాల్ని అందిస్తున్నారు.
Similar News
News January 15, 2025
SHOCK: టీవీల్లో ‘గేమ్ ఛేంజర్’!
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. ‘AP LOCAL TV’ ఛానల్లో పైరసీ HD ప్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు X వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News January 15, 2025
ఒక్కరోజులో 5626% పెరిగిన ట్రంప్ కాయిన్!
US ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక క్రిప్టో కాయిన్ ఉందని తెలుసా! దానిపేరు First Crypto President. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ DTC మార్కెట్ విలువ $141.5M. మొత్తం సప్లై వంద కోట్ల కాయిన్లు. గత 24 గంటల్లో ఇది ఏకంగా 5626% పెరిగింది. $0.0003321 నుంచి $0.01800కు చేరుకుంది. భారత కరెన్సీలో ఇప్పుడు రూ.1.53 పలుకుతోంది. MAGA, WLFI, $POTUS, $DJT సైతం ట్రంప్‌తో సంబంధం ఉన్నవే.
News January 15, 2025
సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?
ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?