News August 19, 2024
BIG ALERT.. ఇవాళ భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు TGలోని ADB, మంచిర్యాల, సిరిసిల్ల, KRMR, ములుగు, భద్రాద్రి, WL, జనగామ, HYD, MDK సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
Similar News
News July 8, 2025
దాల్చిన చెక్క నీళ్లతో ఎన్ని లాభాలంటే?

దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా తాగాలి. అది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
News July 8, 2025
అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్‌ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్‌టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.
News July 8, 2025
మెగా DSCపై తప్పుడు ప్రచారాలు: విద్యాశాఖ

AP: మెగా DSC అభ్యర్థులు పరీక్షలపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ‘కొన్ని పత్రికలు, SMలో పరీక్షలపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సాఫ్టవేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ధ్రువీకరణ కాలేదు. అధికారిక సమాచారంలేని ప్రచారాలు నమ్మొద్దు. అభ్యర్థుల సహాయం కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొంది.