News August 19, 2024
నేటి నుంచి ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 23న ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్లను ప్రకటిస్తారు. 30 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
Similar News
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.
News July 6, 2025
SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.