News August 19, 2024
చీరాల రైల్వే స్టేషన్ @125

చీరాల రైల్వే స్టేషన్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ బ్రిటిష్ పాలకులు రైల్వే లైను నిర్మించారు. ఇందులో భాగంగా కోల్ కతా, చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వేస్టేషన్‌ను 1899లో అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిపాలన కింద ఉంది.
Similar News
News November 5, 2025
ప్రకాశం: సముద్ర స్నానానికి వస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ☛ పోలీసుల సూచనలు పాటించాలి☛ తీరం లోపలికి పోకుండా.. నిర్దిష్ట ప్రదేశంలో స్నానాలను ఆచరించాలి☛ అలల ఉధృతి సమయంలో జాగ్రత్త వహించాలి☛ చిన్నారులను తీరం లోపలికి తీసుకువెళ్లకపోవడమే మంచిది☛ విలువైన వస్తువులను జాగ్రత్తపరచుకోవాలి☛ వాతావరణం ప్రతికూలంగా ఉంటే మరింత జాగ్రత్త అవసరం
News November 4, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.
News November 4, 2025
ఆఫీస్‌కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.


