News August 19, 2024
వేములవాడ: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి మనస్తాపంతో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన గీసి శిరీష(20) సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శిరీష డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా, శిరీష అన్నయ్య తన చెల్లిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నట్లు వేములవాడ రూరల్ SI మారుతికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.
Similar News
News July 7, 2025
నేడు కరీంనగర్‌లో మంత్రుల పర్యటన

కరీంనగర్‌లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.
News July 7, 2025
కరీంనగర్: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది కరీంనగర్ జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670759 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News July 6, 2025
కాశ్మీర్ విషయంలో ముఖర్జి దృఢమైన వైఖరి: బండి సంజయ్

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన పడిన తపనను, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన దృఢమైన వైఖరిని బండి సంజయ్ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.