News August 19, 2024
పిఠాపురం: వర్మ మాటలు వక్రీకరణ.. పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల కాకినాడ జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మాజీ MLA వర్మ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను వక్రీకరించి ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే దాన్ని పలు యూట్యూబ్ ఛానల్స్ సొంత ప్రయోజనాల కోసం వర్మ మాటలు వక్రీకరించి కథనాలు ప్రచురించారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News August 24, 2025
‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
News August 23, 2025
చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
News August 23, 2025
వినాయక ఉత్సవ కమిటీలకు కలెక్టర్ విజ్ఞప్తి

రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాల అనుమతుల మంజూరు కోసం సింగిల్ విండో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి తెలిపారు. ఉత్సవ కమిటీలు సులభంగా అనుమతులు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో నగరపాలక సంస్థకు సహకరించాలని ఆమె ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.