News August 19, 2024
మీకు అన్నివేళలా అండగా ఉంటా: CBN

AP: ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. టీడీపీ ఆది నుంచి ఆడబిడ్డల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశమే. డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మీకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 8, 2025
బెల్లీ ఫ్యాట్‌తో సోరియాసిస్: యూకే పరిశోధకులు

నడుము చుట్టు కొవ్వు పెరుకుపోయే వారిలో చర్మ వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం ఉందని యూకే పరిశోధకులు కనుగొన్నారు. 25 వేర్వేరు శరీర అవయవాలపై చేసిన పరిశీలనల్లో ఈ చర్మ వ్యాధికి బెల్లీ ఫ్యాట్ ఓ కారణమని గుర్తించారు. మహిళల్లో ఈ ముప్పు ఎక్కువని తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఊబకాయం స్థాయిని అంచనా వేయగలుగుతున్నా సోరియాసిస్ ముప్పును అంచనా వేయలేమని చెబుతున్నారు. సోరియాసిస్‌కు జన్యు మూలాలూ ఓ కారణం కావొచ్చు.
News July 8, 2025
మహిళా సంఘాల బీమా పొడిగింపు

TG: మహిళా సంఘాలకు ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు 2029 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 419 మంది ప్రమాద బీమా కోసం అప్లై చేయగా 204 కేసులు సెటిల్ చేశారు. కాగా స్వయం సహాయక సంఘాల్లో 47 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.
News July 8, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: అదే హాట్ టాపిక్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో TDP మద్దతు కోసం కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ BRS గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలను BRS వర్గాలు ఖండిస్తున్నాయి. 2023లో TDP మద్దతు లేకుండానే HYDలో దాదాపు అన్ని సీట్లను గెలిచామని, తమకు ఆ అవసరం లేదని పేర్కొంటున్నాయి.