News August 19, 2024

మహిళలపై దాడులను అడ్డుకోవాలి: డీజీ శిఖాగోయెల్‌

image

సురక్షిత సమాజం కోసం రాష్ట్ర ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలుపాలని, మహిళల రక్షణలో బాధ్యులు కావాలని వింగ్‌ డీజీ శిఖాగోయెల్‌ ఎక్స్‌ వేదికగా కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై స్వీయ అవగాహన అవసరమని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించే విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. గృహహింస, లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Similar News

News January 19, 2026

HYD: ఎక్కడ పడితే అక్కడ సిమ్‌లు కొంటున్నారా?

image

సిమ్ కార్డులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన దినేష్, సాయిప్రదీప్ నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులను అమ్ముతూ మోసాలు చేస్తున్నారు. సిమ్ కోసం వచ్చిన వారి వేలిముద్రలతో మరికొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థుకు అమ్ముతున్నారు. దీంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ వీరిని అదుపులోకి తీసుకొని 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

News January 19, 2026

HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

image

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

News January 19, 2026

HYD: TDR అంటే ఏమిటి..? ఎందుకు ముఖ్యం..?

image

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) అనేది ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే ఓ అదనపు నిర్మాణ హక్కు. చెరువుల FTL, బఫర్ జోన్లు లేదా రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన రైతులకు/ యజమానులకు నగదుకు బదులుగా ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అలాగే యజమానులు ఆ హక్కులను వేరే చోట అదనపు అంతస్తుల కోసం వాడుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల కల్పనకు కీలకం.