News August 19, 2024

MBNR: బస్సులో పురుడు పోసిన కండక్టర్..

image

బస్సు కండక్టర్ నిండు గర్భిణీకి పురుడు పోసిన ఘటన గద్వాల్ మండలం కొండపల్లిలో సోమవారం జరిగింది. గద్వాల్ నుంచి వనపర్తికి పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సులో గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును ఆపి, బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. ఈ విషయంపై సజ్జనర్ Xలో ట్వీట్ చేశారు.

Similar News

News February 27, 2026

పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

image

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News February 27, 2026

MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.