News August 19, 2024

రజనీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

image

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెట్టయాన్’. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. థియేటర్లలో వెట్టయాన్ వేట మొదలు కానుందని తెలిపింది. ఈ సినిమాలో రజనీ ఐపీఎస్‌గా కనిపించనున్నారు. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కంగువా’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది.

Similar News

News November 6, 2025

మొత్తానికి ట్రంప్‌కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

image

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్‌కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్‌లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.

News November 6, 2025

MOILలో 99 ఉద్యోగాలు

image

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<>MOIL<<>>)లో 99 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ కమ్ ఆపరేటర్ , మైన్ ఫోర్‌మెన్, సెలక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్‌మేట్, బ్లాస్టర్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్‌సైట్: https://www.moil.nic.in/

News November 6, 2025

‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

image

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.