News August 19, 2024

మంత్రి కొండా సురేఖకి సీఎం బర్త్- డే విషెస్ 

image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ .. రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సోషల్ మీడియా వేదికగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 20, 2026

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

News January 20, 2026

వరంగల్: ‘ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

వరంగల్ జిల్లాలోని దివ్యాంగులకు వివిధ సహాయ ఉపకరణాల మంజూరుకు అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి.రాజమణి తెలిపారు. అర్హత గల వారికి బ్యాటరీ వీల్ ఛైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు (డిగ్రీ విద్యార్థులకు), ట్యాబులు మంజూరు చేసి అందిస్తామన్నారు.

News January 19, 2026

వరంగల్: మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని పక్కాగా అమలు చేసి, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.