News August 19, 2024
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయండి: బండి

TG: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాఫీ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. విలీనం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Similar News
News July 8, 2025
12లోగా MPTC స్థానాల తుది జాబితా

TG: MPTCల పునర్విభజనను జులై 12లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. పలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో, కొన్ని పొరుగు పంచాయతీల్లో విలీనమవడం, జిల్లా మారడం వంటివి జరగడంతో డీలిమిటేషన్ చేయనుంది. ప్రతి మండలంలో కనీసం 5 MPTC స్థానాలు ఉండాలని, ఇవాళ ముసాయిదా స్థానాలు ప్రచురించాలని సూచించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించి 12న తుది జాబితాను ప్రకటించాలంది.
News July 8, 2025
వరుసగా మూడు సెంచరీలు చేసిన ముషీర్

టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నారు. లౌబరో UCCEతో జరిగిన మ్యాచులో ముంబై ఎమర్జింగ్ టీమ్ తరఫున ఆడుతున్న ముషీర్ వరుసగా మూడో సెంచరీ చేశారు. 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశారు. అంతకుముందు నాటింగ్‌హమ్ షైర్‌తో జరిగిన మ్యాచులో సెంచరీతో పాటు ఆరు వికెట్లు తీయగా, కంబైన్డ్ నేషనల్ కౌంటీస్‌పైనా సెంచరీ చేశారు.
News July 8, 2025
రెండు రోజులు భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, BHPL, మెదక్, కామారెడ్డిలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40-50km వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.